Proverbs · chapter 8 · verse 34
Proverbs 8:34 in Telugu
అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
Anudinamu naa gadapayodda kanipettukoni naa dvaarabandhamulayodda kaachukoni naa upadeshamu vinuvaaru dhanyulu.
Proverbs 8:34 in English
- King James Version (KJV)
- Blessed [is] the man that heareth me, watching daily at my gates, waiting at the posts of my doors.
- World English Bible (WEB)
- Blessed is the man who hears me, watching daily at my gates, waiting at my door posts.
- American Standard Version (ASV)
- Blessed is the man that heareth me, Watching daily at my gates, Waiting at the posts of my doors.
- Bible in Basic English (BBE)
- Happy is the man who gives ear to me, watching at my doors day by day, keeping his place by the pillars of my house.
- Darby Translation (DBY)
- Blessed is the man that heareth me, watching daily at my gates, waiting at the posts of my doors.
- Webster's Bible (WBS)
- Blessed [is] the man that heareth me, watching daily at my gates, waiting at the posts of my doors.
- Young's Literal Translation (YLT)
- O the happiness of the man hearkening to me, To watch at my doors day by day, To watch at the door-posts of my entrance.
Read in context
- 32కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
- 33ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
- 34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
- 35నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
- 36నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.
Cross references
- Luke 11:28 లూకా 11:28ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
- Matthew 7:24 మత్తయి 7:24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.
- Proverbs 3:13 సామెతలు 3:13జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు.
- Psalm 27:4 కీర్తనలు 27:4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.
- Luke 10:39 లూకా 10:39ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను.
- Acts 2:42 అపొస్తలుల కార్యములు 2:42వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.
- Acts 17:11–12 అపొస్తలుల కార్యములు 17:11–12వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.
- Psalm 84:10 కీర్తనలు 84:10నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము. భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము.
- Proverbs 3:18 సామెతలు 3:18దాని నవలంబించువారికి అది జీవవృక్షము దాని పట్టుకొనువారందరు ధన్యులు.
- Proverbs 2:3–4 సామెతలు 2:3–4తెలివికై మొఱ్ఱపెట్టిన యెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన యెడల
- Luke 1:6 లూకా 1:6వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
- Psalm 92:13 కీర్తనలు 92:13యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.