Psalms · chapter 109 · verse 10
Psalm 109:10 in Telugu
వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక
Vaani biddalu deshadrimmarulai bhikshamettuduru gaaka paadupadina tama yindlaku dooramugaa jeevanamu vedakuduru gaaka
Psalm 109:10 in English
- King James Version (KJV)
- Let his children be continually vagabonds, and beg: let them seek [their bread] also out of their desolate places.
- World English Bible (WEB)
- Let his children be wandering beggars. Let them be sought from their ruins.
- American Standard Version (ASV)
- Let his children be vagabonds, and beg; And let them seek [their bread] out of their desolate places.
- Bible in Basic English (BBE)
- Let his children be wanderers, looking to others for their food; let them be sent away from the company of their friends.
- Darby Translation (DBY)
- Let his sons be vagabonds and beg, and let them seek [their bread] far from their desolate places;
- Webster's Bible (WBS)
- Let his children be continually vagabonds, and beg: let them seek [their bread] also out of their desolate places.
- Young's Literal Translation (YLT)
- And wander continually do his sons, Yea, they have begged, And have sought out of their dry places.
Read in context
- 8వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
- 9వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక
- 10వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక
- 11వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక
- 12వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక
Cross references
- Genesis 4:12–14 ఆదికాండము 4:12–14నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. అందుకు కయీనునా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.
- Psalm 37:25 కీర్తనలు 37:25నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు.
- Psalm 59:15 కీర్తనలు 59:15తిండికొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగనియెడల రాత్రి అంతయు ఆగుదురు.
- 2 Kings 5:27 2 రాజులు 5:27కాబట్టి నయమానునకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము గలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లెను.
- Isaiah 16:2 యెషయా 16:2గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద మోయాబు కుమార్తెలు కన బడుదురు.
- Job 24:8–12 యోబు 24:8–12పర్వతములమీది జల్లులకు తడిసియుందురు చాటులేనందున బండను కౌగలించుకొందురు. తండ్రిలేని పిల్లను రొమ్మునుండి లాగువారు కలరువారు దరిద్రులయొద్ద తాకట్టు పుచ్చుకొందురు దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు. జనముగల పట్టణములో మూలుగుదురు గాయపరచబడినవారు మొఱ్ఱపెట్టుదురు అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు.
- Job 30:3–9 యోబు 30:3–9దారిద్ర్యముచేతను క్షామముచేతను శుష్కించినవారై ఎడారిలో చాల దినములనుండి పాడై నిర్మానుష్య ముగానున్న యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురు వారు తుప్పలలోని తుత్తిచెట్లను పెరుకుదురు తంగేడువేళ్లు వారికి ఆహారమైయున్నవి. వారు నరుల మధ్యనుండి తరిమివేయబడిన వారు దొంగను తరుముచు కేకలు వేయునట్లు మనుష్యులు వారిని తరుముచు కేకలు వేయుదురు. భయంకరమైన లోయలలోను నేల సందులలోను బండల సందులలోను వారు కాపుర ముండవలసి వచ్చెను. తుప్పలలో వారు ఓండ్ర పెట్టుదురు ముళ్లచెట్లక్రింద వారు కూడియుందురు. వారు మోటువారికిని పేరు ప్రతిష్ఠతలు లేనివారికిని పుట్టినవారు వారు దేశములోనుండి తరుమబడినవారు. అట్టివారు ఇప్పుడు నన్నుగూర్చి పదములు పాడుదురు నేను వారికి సామెతకు ఆస్పదముగా నున్నాను.
- 2 Samuel 3:29 2 సమూయేలు 3:29ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగి యైనను కఱ్ఱపట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను.