Psalms · chapter 127 · verse 1
Psalm 127:1 in Telugu
యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
Yehovaa illu kattinchaniyedala daani kattuvaari prayaasamu vyarthame. Yehovaa pattanamunu kaapaadaniyedala daani kaavalikaayuvaaru melukoni yundutavyarthame.
Psalm 127:1 in English
- King James Version (KJV)
- A Song of degrees for Solomon. Except the LORD build the house, they labour in vain that build it: except the LORD keep the city, the watchman waketh [but] in vain.
- World English Bible (WEB)
- A Song of Ascents. By Solomon. Unless the LORD builds the house, they who build it labor in vain. Unless the LORD watches over the city, the watchman guards it in vain.
- American Standard Version (ASV)
- A Song of Ascents; of Solomon. Except Jehovah build the house, They labor in vain that build it: Except Jehovah keep the city, The watchman waketh but in vain.
- Bible in Basic English (BBE)
- A Song of the going up. Of Solomon. If the Lord is not helping the builders, then the building of a house is to no purpose: if the Lord does not keep the town, the watchman keeps his watch for nothing.
- Darby Translation (DBY)
- A Song of degrees. Of Solomon. Unless Jehovah build the house, in vain do its builders labour in it; unless Jehovah keep the city, the keeper watcheth in vain:
- Webster's Bible (WBS)
- A Song of degrees for Solomon. Except the LORD shall build the house, they labor in vain that build it: except the LORD shall keep the city, the watchman waketh in vain.
- Young's Literal Translation (YLT)
- A Song of the Ascents, by Solomon. If Jehovah doth not build the house, In vain have its builders laboured at it, If Jehovah doth not watch a city, In vain hath a watchman waked.
Read in context
- 1యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
- 2మీరువేకువనే లేచి చాలరాత్రియైన తరువాత పండు కొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారి కిచ్చు చున్నాడు.
- 3కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే
Cross references
- Proverbs 16:9 సామెతలు 16:9ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును
- 1 Corinthians 3:7 1 కొరింథీయులకు 3:7కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.
- Proverbs 21:30–31 సామెతలు 21:30–31యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు. యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
- 1 Corinthians 3:9–15 1 కొరింథీయులకు 3:9–15మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి యైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచు కొనవలెను. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాదిమీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కఱ్ఱ, గడ్డి, కొయ్యకాలు మొదలైనవాటితో కట్టినయెడల, వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలు పరచబడును. మరియు వాని వాని పని యెట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును; అతడు తనమట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.
- Psalm 33:16–18 కీర్తనలు 33:16–18ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు. రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింప జాలదు. వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును
- Psalm 121:3–5 కీర్తనలు 121:3–5ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
- Psalm 124:1 కీర్తనలు 124:1మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
- 1 Chronicles 28:10 1 దినవృత్తాంతములు 28:10పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము.
- Isaiah 62:6 యెషయా 62:6యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు.
- 1 Chronicles 28:20 1 దినవృత్తాంతములు 28:20మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగానీవు బలముపొంది ధైర్యము తెచ్చుకొని యీ పని పూనుకొనుము, భయపడ కుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతోకూడ నుండును; యెహోవా మందిరపు సేవను గూర్చిన పనియంతయు నీవు ముగించువరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువక యుండును.
- Jeremiah 51:12 యిర్మీయా 51:12బబులోను ప్రాకారములమీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి కావలి బలముచేయుడి కావలివారిని పెట్టుడి మాటు లను సిద్ధపరచుడి బబులోను నివాసులనుగూర్చి తాను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానముచేసిన పని తాను జరిగింపబోవుచున్నాడు.
- 1 Corinthians 15:14 1 కొరింథీయులకు 15:14మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే.