1 Chronicles · chapter 2 · verse 4
1 Chronicles 2:4 in Telugu
మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
Mariyu atani kodalaina taamaaru ataniki peresunu jerahunu kanenu. Yoodaa kumaarulandarunu ayidu guru.
1 Chronicles 2:4 in English
- King James Version (KJV)
- And Tamar his daughter in law bare him Pharez and Zerah. All the sons of Judah [were] five.
- World English Bible (WEB)
- Tamar his daughter-in-law bore him Perez and Zerah. All the sons of Judah were five.
- American Standard Version (ASV)
- And Tamar his daughter-in-law bare him Perez and Zerah. All the sons of Judah were five.
- Bible in Basic English (BBE)
- And Tamar, his daughter-in-law, had Perez and Zerah by him. All the sons of Judah were five.
- Darby Translation (DBY)
- And Tamar his daughter-in-law bore him Pherez and Zerah. All the sons of Judah were five.
- Webster's Bible (WBS)
- And Tamar his daughter-in-law bore him Pharez and Zerah. All the sons of Judah [were] five.
- Young's Literal Translation (YLT)
- And Tamar his daughter-in-law hath borne to him Pharez and Zerah. All the sons of Judah [are] five.
Read in context
- 2దాను యోసేపు బెన్యామీను నఫ్తాలి గాదు ఆషేరు.
- 3యూదా కుమారులు ఏరు ఓనాను షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయ కుమార్తెయందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వానిని చంపెను.
- 4మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును జెరహును కనెను. యూదా కుమారులందరును అయిదు గురు.
- 5పెరెసు కుమారులు హెస్రోను హామూలు.
- 6జెరహు కుమారులు అయిదుగురు, జిమీ ఏతాను హేమాను కల్కోలు దార.
Cross references
- Matthew 1:3 మత్తయి 1:3యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;పెరెసు ఎస్రోమును కనెను
- Genesis 38:13–30 ఆదికాండము 38:13–30దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతని కియ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి, ముసుకు వేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక - నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె - నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు - నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు - నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె - నీ ముద్రయు దాని దారమును నీ చేతి కఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి అప్పుడామె లేచి పోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను. తరువాత యూదా ఆ స్త్రీ యొద్ద నుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లా మీయుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు - మార్గమందు ఏనాయిము నొద్ద నుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు - ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి. కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు; మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా - మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచుకొననిమ్ము; ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను. రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా - ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను. ఆమెను బయటికి తీసికొని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి - ఇవి యెవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను. యూదా వాటిని గురుతుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు. ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱ నూలు తీసి వాని చేతికి కట్టి - ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీ వేల భేదించుకొని వచ్చితి వనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.
- Numbers 26:20–21 సంఖ్యాకాండము 26:20–21యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు; పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
- Luke 3:33 లూకా 3:33నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
- Ruth 4:12 రూతు 4:12ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ ¸యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.
- Genesis 38:11 ఆదికాండము 38:11అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగు వరకు నీ తండ్రి యింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.
- Nehemiah 11:4 నెహెమ్యా 11:4మరియు యెరూష లేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.
- Numbers 26:13 సంఖ్యాకాండము 26:13జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు.
- 1 Chronicles 9:6 1 దినవృత్తాంతములు 9:6జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబది మంది,
- Ruth 4:18 రూతు 4:18పెరెసు వంశావళి యేదనగాపెరెసు హెస్రోనును కనెను,
- Nehemiah 11:24 నెహెమ్యా 11:24మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజ బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.
- 1 Chronicles 9:4 1 దినవృత్తాంతములు 9:4యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.