2 Kings · chapter 19 · verse 26
2 Kings 19:26 in Telugu
కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
Kaabatti vaati kaapurasthulu balaheenulai jadisiri vibhraantinondi polamuloni gaddivalenu kaadaveyani chelavalenu ayiri.
2 Kings 19:26 in English
- King James Version (KJV)
- Therefore their inhabitants were of small power, they were dismayed and confounded; they were [as] the grass of the field, and [as] the green herb, [as] the grass on the housetops, and [as corn] blasted before it be grown up.
- World English Bible (WEB)
- Therefore their inhabitants had little power. They were dismayed and confounded. They were like the grass of the field and like the green herb, like the grass on the housetops and like grain blasted before it has grown up.
- American Standard Version (ASV)
- Therefore their inhabitants were of small power, they were dismayed and confounded; they were as the grass of the field, and as the green herb, as the grass on the housetops, and as grain blasted before it is grown up.
- Bible in Basic English (BBE)
- This is why their townsmen had no power, they were broken and put to shame; they were like the grass of the field and the green plant, like grass on the house-tops.
- Darby Translation (DBY)
- And their inhabitants were powerless, They were dismayed and put to shame; They were [as] the growing grass, and [as] the green herb, [As] the grass on the housetops, and grain blighted before it be grown up.
- Webster's Bible (WBS)
- Therefore their inhabitants were of small power, they were dismayed and confounded; they were [as] the grass of the field, and [as] the green herb, [as] the grass on the house-tops, and [as corn] blasted before it is grown up.
- Young's Literal Translation (YLT)
- And their inhabitants [are] feeble-handed, They were broken down, and are dried up, They have been the herb of the field, And the greenness of the tender grass, Grass of the roofs, And blasted corn — before it hath risen up!
Read in context
- 24నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్నిటిని ఎండిపో జేసియున్నాను.
- 25నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నావలననే సంభవించినది.
- 26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి.
- 27నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి.
- 28నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
Cross references
- Jeremiah 51:32 యిర్మీయా 51:32దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను.
- Psalm 129:6–8 కీర్తనలు 129:6–8వారు ఇంటిమీద పెరుగు గడ్డివలె నుందురు గాక ఎదుగక మునుపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపు కొనడు. దారిన పోవువారుయెహోవా ఆశీర్వాదము నీమీద నుండునుగాక యెహోవా నామమున మేము మిమ్ము దీవించు చున్నాము అని అనకయుందురు.
- Numbers 14:9 సంఖ్యాకాండము 14:9మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా
- Psalm 127:1 కీర్తనలు 127:1యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
- Psalm 102:11 కీర్తనలు 102:11నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
- Jeremiah 51:30 యిర్మీయా 51:30బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి
- James 1:10–11 యాకోబు 1:10–11ఏలయనగా ఇతడు గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడుదయించి, వడగాలి కొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; ఆలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడి పోవును.
- Numbers 11:23 సంఖ్యాకాండము 11:23అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.
- Psalm 92:7 కీర్తనలు 92:7నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడుపనులు చేయువారందరు పుష్పించుదురు.
- 1 Peter 1:24 1 పేతురు 1:24గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
- Jeremiah 37:10 యిర్మీయా 37:10మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
- Isaiah 40:6–8 యెషయా 40:6–8ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
Original words (Hebrew)
- inhabitants · H3427יָשַׁב yâshab
- small · H7116קָצֵר qâtsêr
- power · H3027יָד yâd
- dismayed · H2865חָתַת châthath
- confounded · H954בּוּשׁ bûwsh
- grass · H6212עֶשֶׂב ʻeseb
- field · H7704שָׂדֶה sâdeh
- green · H3419יָרָק yârâq
- herb · H1877דֶּשֶׁא desheʼ
- grass · H2682חָצִיר châtsîyr
- housetops · H1406גָּג gâg
- blasted · H7711שְׁדֵפָה shᵉdêphâh
- before · H6440פָּנִים pânîym
- up · H7054קָמָה qâmâh