Job · chapter 21 · verse 22
Job 21:22 in Telugu
ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
Evadainanu devuniki jnyaanamu nerpunaa? Paralokavaasulaku aayana teerpu teerchunu gadaa.
Job 21:22 in English
- King James Version (KJV)
- Shall [any] teach God knowledge? seeing he judgeth those that are high.
- World English Bible (WEB)
- “Shall any teach God knowledge, since he judges those who are high?
- American Standard Version (ASV)
- Shall any teach God knowledge, Seeing he judgeth those that are high?
- Bible in Basic English (BBE)
- Is anyone able to give teaching to God? for he is the judge of those who are on high.
- Darby Translation (DBY)
- Can any teach God knowledge? And he it is that judgeth those that are high.
- Webster's Bible (WBS)
- Shall [any] teach God knowledge? seeing he judgeth those that are high.
- Young's Literal Translation (YLT)
- To God doth [one] teach knowledge, And He the high doth judge?
Read in context
- 20వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. తమ జీవితకాలము సమాప్తమైన తరువాత
- 21తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి చింత ఏమి?
- 22ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా? పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా.
- 23ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను
- 24సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును
Cross references
- Romans 11:34 రోమీయులకు 11:34ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు?
- 1 Corinthians 2:16 1 కొరింథీయులకు 2:16ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగినవారము.
- Isaiah 40:13–14 యెషయా 40:13–14యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
- 1 Corinthians 6:3 1 కొరింథీయులకు 6:3మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులనుగూర్చి మరిముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?
- Psalm 82:1 కీర్తనలు 82:1దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
- Isaiah 40:22–23 యెషయా 40:22–23ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును.
- Job 15:15 యోబు 15:15ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మికయుంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
- Revelation 20:1–3 ప్రకటన 20:1–3మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.
- Revelation 20:12–15 ప్రకటన 20:12–15మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
- Job 40:2 యోబు 40:2ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తర మియ్యవలెను.
- 2 Peter 2:4 2 పేతురు 2:4దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.
- Job 36:22 యోబు 36:22ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు?