Job · chapter 27 · verse 19
Job 27:19 in Telugu
వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
Vaaru dhanamugalavaarai pandukonduru gaani marala levaru kannulu teravagaane lekapovuduru.
Job 27:19 in English
- King James Version (KJV)
- The rich man shall lie down, but he shall not be gathered: he openeth his eyes, and he [is] not.
- World English Bible (WEB)
- He lies down rich, but he will not do so again. He opens his eyes, and he is not.
- American Standard Version (ASV)
- He lieth down rich, but he shall not be gathered [to his fathers]; He openeth his eyes, and he is not.
- Bible in Basic English (BBE)
- He goes to rest full of wealth, but does so for the last time: on opening his eyes, he sees it there no longer.
- Darby Translation (DBY)
- He lieth down rich, but will do so no more; he openeth his eyes, and he is not.
- Webster's Bible (WBS)
- The rich man shall lie down, but he shall not be gathered: he openeth his eyes, and he [is] not.
- Young's Literal Translation (YLT)
- Rich he lieth down, and he is not gathered, His eyes he hath opened, and he is not.
Read in context
- 17వారు దాని సిద్ధపరచుకొనుటయే గాని నీతిమంతులు దాని కట్టుకొనెదరు నిరపరాధులు ఆ వెండిని పంచుకొనెదరు.
- 18పురుగుల గూళ్లవంటి యిండ్లు వారు కట్టుకొందురు కావలివాడు కట్టుకొను గుడిసెవంటి యిండ్లు వారు కట్టుకొందురు.
- 19వారు ధనముగలవారై పండుకొందురు గాని మరల లేవరు కన్నులు తెరవగానే లేకపోవుదురు.
- 20భయములు జలప్రవాహములవలె వారిని తరిమి పట్టు కొనును రాత్రివేళ తుఫాను వారిని ఎత్తికొనిపోవును.
- 21తూర్పుగాలి వారిని కొనిపోగా వారు సమసి పోవు దురు అది వారి స్థలములోనుండి వారిని ఊడ్చివేయును
Cross references
- Job 24:24 యోబు 24:24వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
- Psalm 58:9 కీర్తనలు 58:9మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగర గొట్టుచున్నాడు,
- Psalm 73:19–20 కీర్తనలు 73:19–20క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీకరింతువు.
- Jeremiah 8:2 యిర్మీయా 8:2వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
- Job 21:30 యోబు 21:30అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు ఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
- Job 14:10 యోబు 14:10అయితే నరులు మరణమై కదలలేక పడియుందురు. నరులు ప్రాణము విడిచిన తరువాత వారేమై పోవుదురు?
- Job 14:12–15 యోబు 14:12–15ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరుచున్నాను. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును ఆలాగుండిన యెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.
- Job 7:8 యోబు 7:8నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదును.
- Matthew 3:12 మత్తయి 3:12ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.
- Job 30:23 యోబు 30:23మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేత సమాజమందిరమునకు నీవు నన్ను రప్పించెదవని నాకు తెలియును.
- Job 20:7–9 యోబు 20:7–9తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు. వారిని చూచినవారు వారేమైరని యడుగుదురు. కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు
- Job 21:23–26 యోబు 21:23–26ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన యెముకలలో మూలుగ బలిసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతినొందును వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖము గలవాడై మృతినొందును. వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును.