Job · chapter 29 · verse 16
Job 29:16 in Telugu
దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.
Daridrulaku tandrigaa untini eruganivaari vyaajyemunu nenu shraddhagaa vichaarinchitini.
Job 29:16 in English
- King James Version (KJV)
- I [was] a father to the poor: and the cause [which] I knew not I searched out.
- World English Bible (WEB)
- I was a father to the needy. I researched the cause of him whom I didn’t know.
- American Standard Version (ASV)
- I was a father to the needy: And the cause of him that I knew not I searched out.
- Bible in Basic English (BBE)
- I was a father to the poor, searching out the cause of him who was strange to me.
- Darby Translation (DBY)
- I was a father to the needy, and the cause which I knew not I searched out;
- Webster's Bible (WBS)
- I [was] a father to the poor: and the cause [which] I knew not I searched out.
- Young's Literal Translation (YLT)
- A father I [am] to the needy, And the cause I have not known I search out.
Read in context
- 14నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.
- 15గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదము లైతిని.
- 16దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.
- 17దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.
- 18అప్పుడు నేనిట్లనుకొంటినినా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.
Cross references
- Proverbs 29:7 సామెతలు 29:7నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
- Psalm 68:5 కీర్తనలు 68:5తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
- Job 24:4 యోబు 24:4వారు మార్గములో నుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసి వచ్చెను.
- Job 31:18 యోబు 31:18ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను
- Proverbs 25:2 సామెతలు 25:2సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత.
- Esther 2:7 ఎస్తేరు 2:7తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలితండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.
- Deuteronomy 13:14 ద్వితీయోపదేశకాండము 13:14అది నిజమైనయెడల, అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగినయెడల
- Deuteronomy 17:8–10 ద్వితీయోపదేశకాండము 17:8–10హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకాని యెడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థల మునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచు కొను స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరి గించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పుతీర్చుటకు జాగ్రత్తపడవలెను.
- Exodus 18:26 నిర్గమకాండము 18:26వారెల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషే యొద్దకు తెచ్చుచు, స్వల్ప వ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి.
- 1 Kings 3:16–28 1 రాజులు 3:16–28తరువాత వేశ్యలైన యిద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతె యిట్లు మనవి చేసెనునా యేలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక యింటిలో నివసించుచున్నాము; దానితో కూడ ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను; మేమిద్దర మును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి యెవరును లేరు. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్య రాత్రి యిది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి, నా ప్రక్కలోనుండి నా బిడ్డను తీసికొని తన కౌగిటిలో పెట్టుకొని, చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చినదాయెను; తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలిసికొంటిని. అంతలో రెండవ స్త్రీ అది కాదు;బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమెకాదు, చచ్చినదే నీ బిడ్డ బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజుసముఖమున మనవిచేయగా రాజు బ్రదికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని యొక తెయు, రెండవది ఆలాగు కాదు చచ్చినది నీ బిడ్డ బ్రదికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది; గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రదికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరిసగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతట బ్రదికియున్న బిడ్డయొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై, రాజునొద్దనా యేలిన వాడా, బిడ్డను ఎంతమాత్రము చంపక దానికే యిప్పించుమని మనవిచేయగా, ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండ చెరిసగము చేయుమనెను. అందుకు రాజుబ్రదికియున్న బిడ్డను ఎంతమాత్రము చంపక మొదటిదాని కియ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతట ఇశ్రాయేలీయులందరును రాజు తీర్చిన తీర్పునుగూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి.
- Ephesians 5:1 ఎఫెసీయులకు 5:1కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
- James 1:27 యాకోబు 1:27తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.