Job · chapter 41 · verse 32
Job 41:32 in Telugu
అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.
Adi taanu nadachina trovanu tana venuka prakaashimpa jeyunu choochinavaariki samudramu nerasina vendrukalugaa tochunu.
Job 41:32 in English
- King James Version (KJV)
- He maketh a path to shine after him; [one] would think the deep [to be] hoary.
- World English Bible (WEB)
- He makes a path shine after him. One would think the deep had white hair.
- American Standard Version (ASV)
- He maketh a path to shine after him; One would think the deep to be hoary.
- Bible in Basic English (BBE)
- After him his way is shining, so that the deep seems white.
- Darby Translation (DBY)
- He maketh the path to shine after him: one would think the deep to be hoary.
- Webster's Bible (WBS)
- He maketh a path to shine after him; [one] would think the deep [to be] hoary.
- Young's Literal Translation (YLT)
- After him he causeth a path to shine, One thinketh the deep to be hoary.
Read in context
- 30దాని క్రిందిభాగములు కరుకైన చిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును.
- 31కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయును సముద్రమును తైలమువలె చేయును.
- 32అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.
- 33అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.
- 34అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.
Cross references
- Job 38:30 యోబు 38:30జలములు రాతివలె గడ్డకట్టును అగాధజలముల ముఖము గట్టిపరచబడును.
- Genesis 42:38 ఆదికాండము 42:38అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.
- Proverbs 16:31 సామెతలు 16:31నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతిప్రవర్తన గలవానికి కలిగి యుండును.
- Genesis 25:8 ఆదికాండము 25:8అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను.
- Proverbs 20:29 సామెతలు 20:29¸యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము
- Genesis 1:15 ఆదికాండము 1:15భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.
- Job 28:14 యోబు 28:14అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును.
- Genesis 1:2 ఆదికాండము 1:2భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
- Job 38:16 యోబు 38:16సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా?మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా?
- Genesis 15:15 ఆదికాండము 15:15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.