Luke · chapter 8 · verse 38
Luke 8:38 in Telugu
ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
Aayana done yekki tirigi velluchundagaa, dayyamulu vadalipoyina manushyudu, aayanato kooda tannu undanimmani aayananu vedukonenu.
Luke 8:38 in English
- King James Version (KJV)
- Now the man out of whom the devils were departed besought him that he might be with him: but Jesus sent him away, saying,
- World English Bible (WEB)
- But the man from whom the demons had gone out begged him that he might go with him, but Jesus sent him away, saying,
- American Standard Version (ASV)
- But the man from whom the demons were gone out prayed him that he might be with him: but he sent him away, saying,
- Bible in Basic English (BBE)
- But the man from whom the evil spirits had gone out had a great desire to be with him, but he sent him away, saying,
- Darby Translation (DBY)
- But the man out of whom the demons had gone besought him that he might be with him. But he sent him away, saying,
- Webster's Bible (WBS)
- Now the man out of whom the demons had departed, besought him that he might be with him. But Jesus sent him away, saying,
- Young's Literal Translation (YLT)
- And the man from whom the demons had gone forth was beseeching of him to be with him, and Jesus sent him away, saying,
Read in context
- 36అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
- 37గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి.
- 38ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
- 39అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.
- 40జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
Cross references
- Psalm 145:3–12 కీర్తనలు 145:3–12యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది ఒక తరమువారు మరియొక తరమువారియెదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమక్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావమహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకరకార్యముల విక్రమమును మనుష్యులు వివరించె దరు నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతినిగూర్చి వారు గానము చేసెదరు యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయముగలవాడు. యెహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
- Acts 9:13–16 అపొస్తలుల కార్యములు 9:13–16అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.
- Mark 5:18–20 మార్కు 5:18–20ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.
- Isaiah 63:7–13 యెషయా 63:7–13యెహోవా మనకు చేసినవాటన్నిటినిబట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రము లను గానముచేతును. తన వాత్సల్యమునుబట్టియు కృపాబాహుళ్యమును బట్టియు ఇశ్రాయేలుయొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసెదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావద్బాధలో ఆయన బాధనొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమిచేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధియాయెను తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జను లను జ్ఞాపకము చేసికొనెను. తన మందకాపరులకు సహకారియై సముద్రములో నుండి తమ్మును తోడుకొనివచ్చినవాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచినవాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చినవాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారిముందర నీళ్లను విభజించినవాడేడి? మైదానములో గుఱ్ఱము పడనిరీతిగా వారు పడకుండ అగాధజలములలో నడిపించిన వాడేడి? యనుకొనిరి
- Psalm 78:3–6 కీర్తనలు 78:3–6మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగు నట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియ లను మరువకయుండి యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు
- Psalm 116:16 కీర్తనలు 116:16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
- Luke 8:28 లూకా 8:28వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడియేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.
- Psalm 107:21–22 కీర్తనలు 107:21–22ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.
- Psalm 27:4 కీర్తనలు 27:4యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.
- Psalm 116:12 కీర్తనలు 116:12యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
- Galatians 1:23–24 గలతీయులకు 1:23–24మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.
- Deuteronomy 10:20–21 ద్వితీయోపదేశకాండము 10:20–21నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.
Original words (Greek)
- Now · G1161δέ dé
- man · G435ἀνήρ anḗr
- of · G575ἀπό apó
- whom · G3739ὅς hós
- devils · G1140δαιμόνιον daimónion
- were · G1511εἶναι eînai
- departed · G1831ἐξέρχομαι exérchomai
- besought · G1189δέομαι déomai
- him · G846αὐτός autós
- with · G4862σύν sýn
- him · G846αὐτός autós
- but · G1161δέ dé
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs
- sent · G630ἀπολύω apolýō
- him · G846αὐτός autós
- away · G630ἀπολύω apolýō
- saying · G3004λέγω légō