Mark · chapter 9 · verse 10
Mark 9:10 in Telugu
మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
Mrutulalonundi lechuta anagaa emito ani vaarokanito okadu tarkinchuchu aa maata manassuna unchukoniri.
Mark 9:10 in English
- King James Version (KJV)
- And they kept that saying with themselves, questioning one with another what the rising from the dead should mean.
- World English Bible (WEB)
- They kept this saying to themselves, questioning what the “rising from the dead” meant.
- American Standard Version (ASV)
- And they kept the saying, questioning among themselves what the rising again from the dead should mean.
- Bible in Basic English (BBE)
- And they kept the saying, questioning among themselves what the coming back from the dead might be.
- Darby Translation (DBY)
- And they kept that saying, questioning among themselves, what rising from among [the] dead was.
- Webster's Bible (WBS)
- And they kept that saying with themselves, questioning one with another what the rising from the dead should mean.
- Young's Literal Translation (YLT)
- and the thing they kept to themselves, questioning together what the rising out of the dead is.
Read in context
- 8వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
- 9వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
- 10మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
- 11వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.
- 12అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి?
Cross references
- Acts 17:18 అపొస్తలుల కార్యములు 17:18ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.
- John 16:17–19 యోహాను 16:17–19కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పు కొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతిమనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొను చున్నారా?
- John 2:19–22 యోహాను 2:19–22యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము నలువదియారు సంవత్సరములు కట్టిరే; నీవు మూడు దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను. ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి.
- Luke 24:25–27 లూకా 24:25–27అందు కాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
- Luke 18:33–34 లూకా 18:33–34ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు; మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు; ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు.
- Luke 24:7–8 లూకా 24:7–8మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని
- John 12:33–34 యోహాను 12:33–34తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
- John 12:16 యోహాను 12:16ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.
- John 16:29–30 యోహాను 16:29–30ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు. సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా
- Matthew 16:22 మత్తయి 16:22పేతురు ఆయన చేయి పట్టుకొనిప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.
- Genesis 37:11 ఆదికాండము 37:11అతని సహోదరులు అతనియందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను.
- Mark 9:32 మార్కు 9:32వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.