Psalms · chapter 58 · verse 6
Psalm 58:6 in Telugu
దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము.
Devaa, vaari noti pandlanu virugagottumu yehovaa, kodama sinhamula koralanu ooda gottumu.
Psalm 58:6 in English
- King James Version (KJV)
- Break their teeth, O God, in their mouth: break out the great teeth of the young lions, O LORD.
- World English Bible (WEB)
- Break their teeth, God, in their mouth. Break out the great teeth of the young lions, LORD.
- American Standard Version (ASV)
- Break their teeth, O God, in their mouth: Break out the great teeth of the young lions, O Jehovah.
- Bible in Basic English (BBE)
- O God, let their teeth be broken in their mouths; let the great teeth of the young lions be pulled out, O Lord.
- Darby Translation (DBY)
- O God, break their teeth in their mouth; break out the great teeth of the young lions, O Jehovah.
- Webster's Bible (WBS)
- Break their teeth, O God, in their mouth: break out the great teeth of the young lions, O LORD.
- Young's Literal Translation (YLT)
- O God, break their teeth in their mouth, The jaw-teeth of young lions break down, O Jehovah.
Read in context
- 4వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను
- 5వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు.
- 6దేవా, వారి నోటి పండ్లను విరుగగొట్టుము యెహోవా, కొదమ సింహముల కోరలను ఊడ గొట్టుము.
- 7పారు నీళ్లవలె వారు గతించిపోవుదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలై పోవును.
- 8వారు కరగిపోయిన నత్తవలె నుందురు సూర్యుని చూడని గర్భస్రావమువలె నుందురు.
Cross references
- Psalm 3:7 కీర్తనలు 3:7యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
- Hosea 5:14 హోషేయ 5:14ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహమువంటివాడను గాను యూదావారికి కొదమ సింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేక పోవును
- Psalm 10:15 కీర్తనలు 10:15దుష్టుల భుజమును విరుగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవువరకు దానిని గూర్చి విచారణ చేయుము.
- Job 4:10–11 యోబు 4:10–11సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలును విరిగిపోవును. ఎర లేనందున ఆడుసింహము నశించునుసింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.
- Micah 5:8 మీకా 5:8యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనులమధ్యను అనేక జనములలోను అడవిమృగములలో సింహమువలెను, ఎవడును విడిపింపకుండ లోపలికి చొచ్చి గొఱ్ఱెలమందలను త్రొక్కి చీల్చు కొదమసింహమువలెను ఉందురు.
- Psalm 17:12 కీర్తనలు 17:12వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహము వలెను ఉన్నారు.
- Job 29:17 యోబు 29:17దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.
- Isaiah 31:4 యెషయా 31:4యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు తప్పించుటకై గొఱ్ఱెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్య పడకయు తనకు దొరికినదానిమీద గర్జించునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సీయోను పర్వతముమీదికిని దాని కొండమీదికిని దిగి వచ్చును.
- Psalm 91:13 కీర్తనలు 91:13నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కెదవు.
- Ezekiel 30:21–26 యెహెజ్కేలు 30:21–26నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను. ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును. మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బతినిన వాడై మూల్గులిడును. బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు. నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
- Numbers 23:24 సంఖ్యాకాండము 23:24ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును అది సింహమువలె నిక్కి నిలుచును అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు.