1 Timothy · chapter 5 · verse 20
1 Timothy 5:20 in Telugu
ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
Itarulu bhayapadunimittamu paapamu cheyuvaarini andariyeduta gaddimpumu.
1 Timothy 5:20 in English
- King James Version (KJV)
- Them that sin rebuke before all, that others also may fear.
- World English Bible (WEB)
- Those who sin, reprove in the sight of all, that the rest also may be in fear.
- American Standard Version (ASV)
- Them that sin reprove in the sight of all, that the rest also may be in fear.
- Bible in Basic English (BBE)
- Say sharp words to sinners when all are present, so that the rest may be in fear.
- Darby Translation (DBY)
- Those that sin convict before all, that the rest also may have fear.
- Webster's Bible (WBS)
- Them that sin rebuke before all, that others also may fear.
- Young's Literal Translation (YLT)
- Those sinning, reprove before all, that the others also may have fear;
Read in context
- 18ఇందుకు నూర్చెడి యెద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది.
- 19మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము
- 20ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము.
- 21విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.
- 22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాప ములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము.
Cross references
- 2 Timothy 4:2 2 తిమోతికి 4:2వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
- 1 Timothy 1:20 1 తిమోతికి 1:20వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని.
- Deuteronomy 13:11 ద్వితీయోపదేశకాండము 13:11అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు.
- Titus 1:13 తీతుకు 1:13ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక,
- Acts 5:11 అపొస్తలుల కార్యములు 5:11సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.
- Galatians 2:11–14 గలతీయులకు 2:11–14అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరై పోయెను. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగానీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించు చుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింప వలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?
- Acts 5:5 అపొస్తలుల కార్యములు 5:5అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;
- Deuteronomy 19:20 ద్వితీయోపదేశకాండము 19:20మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.
- Deuteronomy 21:21 ద్వితీయోపదేశకాండము 21:21అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.
- Deuteronomy 17:13 ద్వితీయోపదేశకాండము 17:13అప్పుడు జనులందరు విని భయపడి మూర్ఖ వర్తనము విడిచి పెట్టెదరు.
- Leviticus 19:17 లేవీయకాండము 19:17నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
- Acts 19:17 అపొస్తలుల కార్యములు 19:17ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.