John · chapter 5 · verse 10
John 5:10 in Telugu
ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
Aa dinamu vishraantidinamu ganuka yoodulu idi vishraantidinamu gadaa; neevu nee parupettikona tagade ani svasthata nondinavaanito cheppiri.
John 5:10 in English
- King James Version (KJV)
- The Jews therefore said unto him that was cured, It is the sabbath day: it is not lawful for thee to carry [thy] bed.
- World English Bible (WEB)
- So the Jews said to him who was cured, “It is the Sabbath. It is not lawful for you to carry the mat.”
- American Standard Version (ASV)
- So the Jews said unto him that was cured, It is the sabbath, and it is not lawful for thee to take up thy bed.
- Bible in Basic English (BBE)
- So the Jews said to the man who had been made well, It is the Sabbath; and it is against the law for you to take up your bed.
- Darby Translation (DBY)
- The Jews therefore said to the healed [man], It is sabbath, it is not permitted thee to take up thy couch.
- Webster's Bible (WBS)
- The Jews therefore said to him that was cured, it is the sabbath; it is not lawful for thee to carry [thy] bed.
- Young's Literal Translation (YLT)
- the Jews then said to him that hath been healed, 'It is a sabbath; it is not lawful to thee to take up the couch.'
Read in context
- 8యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా
- 9వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
- 10ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
- 11అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.
- 12వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.
Cross references
- Jeremiah 17:21 యిర్మీయా 17:21యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి.
- John 9:16 యోహాను 9:16కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచకక్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను.
- Luke 6:2 లూకా 6:2అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా
- Luke 13:14 లూకా 13:14యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.
- Mark 3:4 మార్కు 3:4వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడి గెను; అందుకు వారు ఊరకుండిరి.
- Nehemiah 13:15–21 నెహెమ్యా 13:15–21ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలుతొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని. తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణ స్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలి యుంచితిని. వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూష లేము అవతల బసచేసికొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లంటినిమీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు.
- Mark 2:24 మార్కు 2:24అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి.
- John 5:16 యోహాను 5:16ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.
- Matthew 12:2–8 మత్తయి 12:2–8పరిసయ్యులది చూచి ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతో కూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.
- Luke 23:56 లూకా 23:56తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
- Jeremiah 17:27 యిర్మీయా 17:27అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.
- Exodus 31:12–17 నిర్గమకాండము 31:12–17మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోనిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును. ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.